పర్యాటక స్వర్గధామంగా పేరుగాంచిన థాయిలాండ్‌లో ఇటీవలి కాలంలో ఒక కొత్త ధోరణి ఉద్భవించింది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో మహిళలు పర్యాటకులకు “అద్దె భార్యలు”గా అందుబాటులోకి వస్తున్నారు..వీరిని స్థానికంగా “సరోగసి భార్యలు” అని పిలుస్తున్నారు. తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకుని వంట చేయడం, ఇంటి పనులు చూసుకోవడం, భర్తలుగా వ్యవహరించే పర్యాటకులతో బయటికి వెళ్లడం వంటి బాధ్యతలను ఈ మహిళలు నిర్వరిస్తున్నారు. ఈ విధానం చట్టబద్ధం కాకపోయినా, ఆచరణలో కొనసాగుతోంది.
పేదరికమే కారణం?
ఈ పరిణామం వెనుక ఉన్న ప్రధాన కారణం పేదరికమే. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న మహిళలు తమ కుటుంబాల భారం తట్టుకోలేక ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఒక్కో మహిళ కోసం నిర్ణయించే అద్దె విలువ వయస్సు, రూపం, చదువు, ఒప్పంద కాలం ఆధారంగా మారుతోంది. భారత కరెన్సీలో ఇది 1.4 లక్షల నుండి ఒక కోటి వరకు ఉంటుందని సమాచారం. తాత్కాలికంగా ఇది మహిళలకు ఉపాధి కలిగిస్తున్నా, దీని దీర్ఘకాల ప్రభావం సమాజానికి గణనీయమైన సవాళ్లను విసురుతోంది.
ఇక్కడ ‘గర్ల్ ఫ్రెండ్ ఫర్ హైర్’
జపాన్, కొరియా వంటి దేశాల్లో “గర్ల్‌ఫ్రెండ్ ఫర్ హైర్” విధానం అందుబాటులో ఉంది. కానీ థాయిలాండ్‌లో “అద్దె భార్య” కల్చర్ కొత్తగా మొదలైంది. పర్యాటక ఆర్థిక వ్యవస్థకు ఇది లాభదాయకంగా కనిపించినా, దీని ఫలితాలు మానవ సంబంధాలు, కుటుంబ విలువలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు…