న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబో ప్రీమియర్స్‌ The Paradise బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ

న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబో ప్రీమియర్స్‌తోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం, రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా చిత్రం వస్తుందటంతో ‘ది ప్యారడైజ్’పై జనాల్లో హైప్ ఆకాశాన్ని తాకింది. రెగ్యులర్ రిలీజ్ కంటే ముందే సెప్టెంబర్ 23 రాత్రి దేశవ్యాప్తంగా ప్రదర్శించిన ది ప్యారడైజ్ స్పెషల్ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా కేవలం ప్రీమియర్స్‌తోనే ఏకంగా రూ. 12.8 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. నాని కెరీర్‌లోనే ఇది ఆల్-టైమ్ రికార్డ్ ఓపెనింగ్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు కనీవినీ ఎరుగని స్థాయిలో థియేటర్లలో రికార్డు ఆక్యుపెన్సీ నమోదైంది.

శ్రీకాంత్ ఓదెల విజువల్ మేకింగ్, నాని నెవర్ బిఫోర్ మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ఉన్న భారీ అంచనాలకు ప్రీమియం టికెట్ రేట్లు కూడా తోడవడంతో వసూళ్ల జాతర సాగింది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లోని ప్రీమియర్ షోలన్నీ గంటల వ్యవధిలోనే హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేశాయి. ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్‌గా కయాదు లోహర్ తన అందం, అభినయంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా మారగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, సంపూర్ణేష్ బాబు తమ పాత్రల్లో అద్భుతంగా మెప్పించారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక్క రాత్రి ప్రీమియర్స్‌తోనే దాదాపు రూ.13 కోట్లకు చేరువగా గ్రాస్ రాబట్టి ప్రభంజనం సృష్టించిన ‘ది ప్యారడైజ్’, ఫస్ట్ డే ముగిసేసరికి ఇంకెన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.

ప్రొడక్షన్ టీమ్ అందించిన తొలి సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా రూ. 60 కోట్ల మార్కును దాటేసింది. ప్రీమియర్స్, డే-1 గ్రాస్ కలెక్షన్స్ కలిపి మొదటి రోజే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇది నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలవడమే కాకుండా, ఆయన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించింది. మిక్స్డ్ టాక్‌ను సైతం దాటుకుని కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ‘ది పారడైజ్’ మున్ముందు ఇంకెన్ని రికార్డులను తుడిచిపెట్టేస్తుందో ఈ వీకెండ్ లో తెలియనుంది.
మోహన్ బాబు, రాఘవ్ జుయల్ క్రేజీ కాస్టింగ్
nani-the-paradise-takes-box-office-by-storm-heading-towards-massive-day-1-collections

‘దసరా’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల- నాని కాంబినేషన్లో వస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ది ప్యారడైజ్ సినిమాపై హైప్ ఆకాశాన్నంటింది. కలెక్షన్ల సునామీకి తోడు చిత్రంలో నటిస్తున్న క్యాస్టింగ్ కూడా ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సొనాలి కులకర్ణి కీలక పాత్రల్లో కనిపిస్తుండగా, కాయదు లోహర్ కథానాయికగా అలరించనుంది.

ఎస్ఎల్‌వి సినిమాస్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్‌కి అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బిజిఎమ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

నాని బాక్సాఫీస్ మోత.

24 గంటల్లో 3.21 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్‌మైషోలో అమ్ముడవడం అనేది కేవలం నాని వ్యక్తిగత మార్కెట్ రీచ్ మాత్రమే కాకుండా, శ్రీకాంత్ ఓదెల మేకింగ్ పై ఆడియన్స్ చూపిస్తున్న నమ్మకానికి నిదర్శనం. గతంలో రా అండ్ రస్టిక్ కంటెంట్‌ను ప్రాపర్ ఎమోషన్‌తో ప్రెజెంట్ చేసిన అనుభవం ఉండటంతో, ఈ కాంబోకు ‘మాస్ కార్నేజ్’ ఆడియన్స్‌లో గట్టి డిమాండ్ ఏర్పడింది.