యాదాద్రి థర్మల్ ప్లాంట్ పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికం..

యాదాద్రి థర్మల్ ప్లాంట్ పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికం..

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్‌లను అడ్డుకోవడం సరికాదు వేముల రాజు

దేవరకొండ……….
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించి అక్కడి విద్యుత్ ఉత్పత్తి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, బి ఆర్‌ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ మరియు జిల్లా మాజీ ఎమ్మెల్యేల ను పోలీసులు అడ్డుకోవడాన్ని బీ ఆర్‌ ఎస్‌ వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా దేవరకొండలో విలేకరులతో వేముల రాజు మాట్లాడుతూ.. ప్రజలకు సంబంధించిన విద్యుత్ సమస్యలు, థర్మల్ పవర్ ప్లాంట్‌లోని పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్లే రాజకీయ నాయకులను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా అడ్డుకోవడం ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియకుండా చేయాలని ప్రభుత్వం భావించడం సరికాదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకుల పర్యటనలను అడ్డుకోవడం కాకుండా, ప్రజలకు సమాధానం చెప్పే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం కాదు.. ప్రజలకు వాస్తవాలను చెప్పడమే ప్రభుత్వ బాధ్యత అని వేముల రాజు స్పష్టం చేశారు…

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్‌ల యాదాద్రి థర్మల్ ప్లాంట్ పర్యటనకు అనుమతించాలని, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు.