2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో The Paradise మూవీ…వీకెండ్ వరకు ఇదే సాగితే తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు…!
2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో #TheParadise.. నెగిటివ్ టాక్ వచ్చినా, ట్రోల్స్ జరుగుతున్నా..
నాని మాత్రం తన స్టామినాతో నిలబెడుతున్నారంటే గొప్ప విషయమే..
ఇప్పటికీ నైజాంలో సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో సత్తా చూపిస్తుంది ఈ సినిమా..
వీకెండ్ వరకు ఇదే సాగితే తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి..
ది ప్యారడైజ్ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి కలెక్షన్లను నమోదు చేసింది. నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే ఫస్ట్ టైమ్ అత్యధికంగా కలెక్షన్లను రాబట్టింది. యువ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. మోహన్ బాబు, సంపూ, కాయదు లోహర తదితరుల నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా కు. తెలంగాణ నేపథ్యంతో 80వ దశకంలో సికింద్రాబాద్ ప్రాంతంలో అనాదరణకు గురైన గిరిజన తెగ కథా నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మూవీ పాటలు, ప్రోమోలు, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో భారీగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా 100 కోట్లకుపైగా థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకొని 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. నైజాంలో 23 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 4 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక కర్ణాటకలో 6 కోట్ల రూపాయలు, తమిళనాడులో 2.5 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్ష్లలు, ఇతర రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 56 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే.. ప్రీమియర్ల ద్వారా 103368 అమెరికన్ డాలర్లు వసూలు చేయగా, తొలి రోజు 2.2 మిలియన్ డాలర్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం తొలి రోజు ముగిసే సమయానికి ప్రీమియర్లతో కలిపి 88 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం..
2 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో #TheParadise.. నెగిటివ్ టాక్ వచ్చినా, ట్రోల్స్ జరుగుతున్నా.. నాని మాత్రం తన స్టామినాతో నిలబెడుతున్నారంటే గొప్ప విషయమే.. ఇప్పటికీ నైజాంలో సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో సత్తా చూపిస్తుంది ఈ సినిమా.. వీకెండ్ వరకు ఇదే సాగితే తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి..