నాని మేకోవర్ నుంచి డ్యాన్సులు, ఫైట్లు, భాష, యాస అన్ని విషయాల్లో ఎంత కష్టపడినా రొటీన్ కథ అయినా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి., కొన్ని ఎమోషన్స్ కారణంగా ‘ది ప్యారడైజ్’ మూవీపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ మూవీ సెకండాఫ్‌లో వచ్చే కొన్ని సీన్లపై మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంది…
కేసీఆర్‌ను హీరోగా చూపించిన శ్రీకాంత్ ఓదెల…
‘ది ప్యారడైజ్’ మూవీలో శంకరన్న క్యారెక్టర్‌కు మంచి ప్రాధాన్యం దక్కింది. ఓ రకంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు కేసీఆర్‌ను హీరోగా చూపిస్తూ సినిమా తెరకెక్కించాడంటూ అంటున్నారు . కేసీఆర్ ఫ్యాన్స్… ఈ విషయం తెలియక రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సినిమాకు ప్రీమియర్ షోలకు అనుమతులు, టికెట్ హైకులు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. అలాగే 1983లో సికింద్రాబాద్ నియోజికవర్గంలోని ఎమ్మెల్యే, మాలిక్ తొత్తుగా చూపించడం కూడా కాంట్రవర్సీకి కారణం కావచ్చు. ఇలాంటి పొలిటికల్ రిఫరెన్సులపై పార్టీలు, కార్యకర్తలు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Disclaimer ఇచ్చిన చిత్ర యూనిట్…
‘ది ప్యారడైజ్’ మూవీ ప్రారంభంలోనే ఈ చిత్రంలో సన్నివేశాలు, పాత్రలు, ప్రాంతాలు కేవలం కల్పితం మాత్రమేనంటూ disclaimer జోడించింది చిత్ర యూనిట్. అయితే శంకరన్న గెటప్, ముఖ్యమంత్రి గెటప్ వాస్తవిక పాత్రలకు చాలా దగ్గరగా ఉండడంతో ఈ విషయంపై రిలీజ్ రోజు నుంచే రచ్చ మొదలైపోయింది. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి..
1980-85 బ్యాక్ డ్రాప్లో సాగిన కథలో తెలంగాణ మాస్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని పోలిన శంకరన్న పాత్రలో ప్రియదర్శి నటించాడు. ప్రియదర్శి ఎంట్రీకి థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ కూడా దక్కింది. అలాగే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని పోలిన పాత్రలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫేమ్ పి. విజయ్ కుమార్ ఓ సీన్లో కనిపించారు. ఎన్టీఆర్ ఎంట్రీకి కూడా విజిల్స్, కేకలు మార్మోగిపోయాయి.
. కొన్ని రకాల సున్నిత సీన్స్ కూడా అందులో మరోలా చూపించడం కూడా జరిగినట్లుగా సమాచారం.. సెన్సిటివ్ మ్యాటర్స్‌లో కూడా చిత్ర యూనిట్ కేర్ తీసుకోకపోవడం పై… అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ముఖ్యంగా సినిమాలో సవారీ తెగ ప్రజల అస్తిత్వం, గుర్తింపు కోసం పోరాడే క్రమంలో శంకరన్న పలికే డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. “బక్కగా ఉన్నాడు వీడు ఏం చేస్తాడులే అనుకోకు.. సావు నోట్లో తలకాయ పెట్టేసినాసరే.. మీకు గుర్తింపు తీసుకొస్తా!” అంటూ ప్రియదర్శి చెప్పే పవర్ఫుల్ డైలాగ్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. నాని అద్భుతమైన మాస్ యాక్షన్, అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు తోడుగా ప్రియదర్శి క్యామియో అప్పీరెన్స్ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. అలాగే, మరో సీనియర్ దిగ్గజ నటుడు పీ. విజయ్ కుమార్ ఎన్టీఆర్‌ను పోలిన పాత్రలో కనిపించడం ఈ సినిమాకు అదనపు హైలైట్‌గా నిలిచింది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించగా.. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. యాక్షన్ సీన్లతో పాటు తెలంగాణ యాసను ప్రతిబింబించే డైలాగ్స్, పొలిటికల్ రిఫరెన్సులు ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.