సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు షాక్‌..!

సుప్రీంకోర్టులోనూ దానం నాగేందర్‌కు చుక్కెదురు..

హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..

దానం నాగేందర్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం.. అనర్హత పడింది..

మళ్లీ ఎన్నికలకు వెళ్లండి: సుప్రీంకోర్టు

పార్టీ ఫిరాయింపు కేసులో తనను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది… దానం నాగేందర్ అనర్హత వ్యవహారం పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు ఇప్పటికే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసింది. హైకోర్టు తీర్పు పైన సుప్రీంలో దానం ఎస్ఎల్పీ దాఖలు చేసారు..దీని పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. దానం పై హైకోర్టు తీర్పును సమర్థించింది. దానం కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సమయంలోనే అనర్హతకు గురయ్యారని.. ఖైరతాబాద్ కు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పేర్కొంది.

దానం నాగేందర్ పైన సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు తన పైన అనర్హత వేటు వేయటంతో సుప్రీం ను ఆశ్రయించారు. దానం పిటీషన్ పైన బీజేపీ, బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వాదనల తరువాత సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది. దానం పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది..
దానం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ ను తిరస్కరించిన సుప్రీం కోర్టు.. దానం పైన ఇప్పటికే అనర్హత వేటు పడిందని.. ఖైరతాబాద్ కు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చని పేర్కొంది. దానం తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నట్లుగా అసెంబ్లీ రికార్డులు స్పష్టం చేస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. ఇదే సమయంలో దానం నాగేందర్ పిటీషన్ ను తిరస్కరిస్తూనే.. ఇప్పటికే దానం అనర్హతకు గురయ్యారని వ్యాఖ్యానించారు…వ్యక్తిగతంగా పార్టీలో చేరితే తప్పు కాదు పదవితో పాటు ఫిరాయింపు తప్పేనని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో.. దానం నాగేందర్ అంశంలో ఈసీ అధికారిక ప్రకటనే తఱువాయి అన్నట్లుగా పరిస్థితి మారింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఉంటూనే… కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయటంతో నే దానం పైన అనర్హత ఖాయమైందని వ్యాఖ్యానించారు. ఇక, సుప్రీంలోనూ దానంకు ఎదురు దెబ్బ తగలటంతో.. ఇప్పుడు ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక ఖాయమైంది..