పుతిన్ హత్యాయత్నంపై ఆధారాల్లేవు: సీఐఏ స్పష్టం..
క్రెమ్లిన్ ఆరోపించినట్లుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను హత్య చేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నించలేదని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ తేల్చి చెప్పింది..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేదా ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేపట్టిందన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా తేల్చి చెప్పింది. పుతిన్ హత్యాయత్నం జరిగిందన్న మాస్కో వాదనలను ఇది ఖండించడమే కాకుండా, ఈ ఘటన వల్ల సున్నితమైన దౌత్య ప్రయత్నాలు దెబ్బతింటాయన్న ఆందోళనలను కూడా తగ్గించింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) కథనం ప్రకారం, అమెరికా జాతీయ భద్రతా అధికారులను ఉటంకిస్తూ వెల్లడించిన ఇంటెలిజెన్స్ అంచనాల్లో—పుతిన్ లేదా ఆయన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఎలాంటి దాడి చేయలేదని స్పష్టంగా పేర్కొన్నారు..
పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నించిందన్న రష్యా వాదనకు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
పుతిన్ వ్యక్తిగత నివాసం ఉన్న ప్రాంతంలోని సైనిక లక్ష్యాలపై మాత్రమే దాడి చేయాలని ఉక్రెయిన్ యోచించి ఉండవచ్చని, అయితే ఆయన ఇంటికి అత్యంత సమీపంలో ఏ సైనిక స్థావరాలు లేవని ఒక అమెరికా అధికారి వెల్లడించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది.
నోవ్గొరొడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ వ్యక్తిగత నివాసంపై ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా క్రెమ్లిన్ పేర్కొంది. అయితే ఉక్రెయిన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లను నిర్వీర్యం చేశామని, నివాసానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని రష్యా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా విడుదల చేసింది.
ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఖండించిన విషయం తెలిసిందే…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959