*IPL Auction: Day 1*
_
_హైదరాబాద్..
* అర్షదీప్ సింగ్… ₹18 కోట్లకు (పంజాబ్)
* కాగీసొ రబాడా… ₹10కోట్లు (గుజరాత్)
* శ్రేయస్ అయ్యర్… ₹16.75 కోట్లు (పంజాబ్)
* బట్లర్ ₹15.5 కోట్లు (గుజరాత్)
* స్టార్క్… ₹11.75 కోట్లు (ఢిల్లీ)
* రిషబ్ పంత్… ₹27 కోట్లు (లక్నో)
* షామీ… ₹10 కోట్లు(హైదరాబాద్)
* మిల్లర్… ₹7.5 కోట్లు (లక్నో)
* చాహల్… ₹18 కోట్లు (పంజాబ్).
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక ఏ ఆటగాడికి ఇంత ధర పలకలేదు. పంత్ కోసం ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పోటీ పడినప్పటికీ, పోటీ తీవ్రం కావడంతో మధ్యలోనే డ్రాప్ అయింది. చివరికి పంత్ ను ఎల్ఎస్ జీ రికార్డు ధరకు సొంతం చేసుకుంది.
ఇవాళే రెండు రికార్డులు బద్దలు కావడం విశేషం. గత సీజన్ లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లతో రికార్డు సృష్టించగా…. శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. నేటి ఐపీఎల్ మెగా వేలంలో శ్రేయాస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కానీ ఆ రికార్డు కాసేపట్లోనే తెరమరుగైంది. పంత్ ను కళ్లు చెదిరే ధర (రూ.27 కోట్ల )తో లక్నో ఎగరేసుకెళ్లింది..
ఐపీఎల్ మెగా వేలం-2025లో రిషబ్ పంత్ పైనే అందరి దృష్టి నిలిచింది. ఈ స్టార్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్ ను దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. రిషబ్ పంత్ కు వందకు పైగా ఐపీఎల్ మ్యాచ్ల్లో ఆడిన అనుభవం ఉంది. అలాగే వేలాది పరుగులు కూడా సాధించాడు. ఇక యాక్సిడెంట్ తర్వాత మరింత రెచ్చిపోతున్నాడు పంత్. ఇదే క్రమంలో ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రిటైన్ చేయనప్పుడు.. వేలంలో పంత్పై కోట్లాది రూపాయల వర్షం కురుస్తుందని అందరూ భావించారు. ఇప్పుడు అదే జరిగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు రిషభ్ పంత్. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మాత్రం కాదు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ అతనిని 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఇదే భారీ బిడ్డింగ్.