తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తడబాటు మొదలైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది..బుమ్రా 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 487/6 చేయడంతో ఆసీస్ ఎదుట 534 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేయగా, ఆసీస్ 104కే ఆలౌట్ అయింది..భారత జట్టు స్కోరు 350 దాటడంతో ఆస్ట్రేలియా జట్టుకు ఓటమి ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే టెస్టు క్రికెట్లో పటిష్టమైన జట్టు అయినప్పటికీ స్వదేశంలో భారీ మొత్తం ఛేజింగ్‌లో ఆసీస్ జట్టు ఇంకా వెనుకబడి ఉంది. ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనం…
స్వదేశంలో ఆస్ట్రేలియా 15 టెస్టు మ్యాచ్‌ల్లో 300+ స్కోర్లను చేజ్ చేసింది.
అందుల్లో 3 సార్లు మాత్రమే గెలిచింది.
మిగిలిన 7 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయింది. అంటే ఆసీస్ తరచుగా 300+ స్కోరును ఛేజింగ్‌లో ఓటమిని చవిచూసిందని చెప్పవచ్చు
అయితే 300+ స్కోరు ఛేజింగ్‌లో ఆ మ్యాచ్‌ని 5 సార్లు డ్రా చేసుకుంది. అంటే ఓటమి భయంతో ఆసీస్ జట్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించిందనే చెప్పాలి..
ఆస్ట్రేలియా విజయవంతమైన ఛేజింగ్ లు ఇవే..!p
స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టు ఛేజ్ చేసిన అత్యధిక స్కోరు 404. అది కూడా 1948లోనే కావడం గమనార్హం.
దీని తర్వాత 1977లో పెర్త్ టెస్టులో భారత్‌పై 342 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 2 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
అలాగే 1999లో అడిలైడ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 369 పరుగుల ఛేజ్ చేసి విజయం సాధించింది.
అంటే స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టు 350+ పరుగుల ఛేజింగ్‌కు 25 ఏళ్లు పూర్తయ్యాయి. భారత్‌పై తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్‌కి టీమ్ ఇండియా 400+ పరుగుల భారీ టార్గెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది…
సెంచరీల మోత..
విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్ సెంచరీల మోత
భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (161 పరుగులు: 297 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకం సాధించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (77 పరుగులు; 176 బంతుల్లో 5 ఫోర్లు)తో కలిసి జైస్వాల్ తొలి వికెట్ కు 201 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. పరుగుల దాహంతో ఉన్న విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో కోహ్లీ 100 పరుగుల మార్క్ చేరుకున్నాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 30వ సెంచరీ. ఆస్ట్రేలియా గడ్డమీద కోహ్లీకి ఇది 7వ టెస్టు సెంచరీ, కాగా పెర్త్ స్టేడియంలో రెండో శతకం. ఆసీస్ మీద టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ (6) పేరిట ఉండేది. డాన్ బ్రాడ్‌మన్ 29 టెస్టు శతకాల రికార్డును కోహ్లీ అధిగమించాడు.
రెండో రోజు ఆట ముగిసిన వెంటనే ఆటగాళ్లు మైదానం నుంచి బయటకు రాక ముందు కోహ్లీ బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ కు వెళ్లడాన్ని ఎవరూ మరిచపోలేరు. తనపై ఒత్తిడి పెరగడం, పరుగులు చేయాల్సిన బాధ్యత ఉందని కోహ్లీ ప్రాక్టీస్ కు వెళ్లాడని మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. కోహ్లీ సెంచరీ చేసిన అనంతరం భారత్ 6 వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా డిక్లేర్ చేశాడు..
మిడిలార్డర్ సాయంతో ఇన్నింగ్స్ నడిపించిన కోహ్లీ
దేవదత్ పడిక్కల్ (25), వాషింగ్టన్ సుందర్ (29), నితీష్ కుమార్ రెడ్డి 38 నాటౌట్ గా నిలిచాడు. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ కేవలం ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయన్ 2 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాటర్లను వేగంగా ఔట్ చేసిన ఆసీస్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. భారత ఓపెనర్లు రాహుల్, జైస్వాల్ చేసిన 200 పైచిలుకు భారీ భాగస్వామ్యం ఆసీస్ గడ్డమీద తొలి వికెట్ కు అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది.