తిరుపతిలో హల్‌చల్ చేసిన మందుబాబుకు రిమాండ్‌.

తిరుపతిలో హల్‌చల్ చేసిన మందుబాబుకు రిమాండ్‌.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మద్యం మత్తులో హల్‌చల్ చేసిన వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించిన నిందితుడు, కుటుంబంతో గొడవపడి తిరుపతికి వచ్చినట్లు విచారణలో వెల్లడైంది.
ఏకాంత సేవ ముగిసిన అనంతరం ఆలయ ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించిన నిందితుడు, గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైకి ఎక్కి కలకలం సృష్టించాడు. గోపురంపై ఉన్న కలశాలను లాగేందుకు యత్నించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఆలయ భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఆలయ భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించారని టీటీడీ అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని అధికారులు తెలిపారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959