తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..వీఐపీ దర్శనాలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్..!

*తిరుమల*

_*తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..*_

*కంపార్టుమెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం..*

శ్రీవారిని దర్శించుకున్న 63,729 మంది భక్తులు..*

*తలనీలాలు సమర్పించిన 20,957 మంది భక్తులు..*

*హుండీ ఆదాయం రూ.3.85 కోట్లు…..

ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే శనివారం స్వామి వారిని 63,729 మంది భక్తులు దర్శించుకోగా.. 20,957 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.85 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే కంపార్ట్ మెంట్స్ ఖాళీగా ఉండగా, నేరుగా శ్రీవారిని దర్శించే క్యూ లైన్ మాత్రమే రద్దీగా ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది..

*వీఐపీ దర్శనాలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్*

దేశంలోని అన్ని ఆలయాల్లో వీఐపీ, ప్రత్యేక చెల్లింపు దర్శనాలు సమానత్వ హక్కు ఉల్లంఘన కిందకు వస్తాయని ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాంటి దర్శనాలను రద్దు చేయాలని
కోరారు.చట్టంలో వీఐపీ అనే పదానికి నిర్వచనం లేదన్నారు ఈ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం డిసెంబర్ 10న విచారించనుంది.