తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్ లో ఒకరినొకరు కొట్టుకున్న భక్తులు..
వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. ఒకేసారి క్యూలైన్లకు భక్తులను వదలడంతో ఒకరినొకరు తోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్ లో భక్తులు ఒకరినొకరు కొట్టుకున్నారు..
నిన్న సాయంత్రం క్యూలైన్లో చిన్న పిల్లలతో వస్తున్న మహిళల ను తోటి భక్తులు తోసి వేశారని ఒకరిని ఒకరు కొట్టుకున్న భక్తులు..
అక్కడే ఉన్న విజిలెన్స్, పోలీస్ సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు ఒకరికి ఒకరు కొట్టుకోవడం జరిగింది…
శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ భక్తులకి ఎంత సర్ది చెప్పినా వినకుండా గొడవకు దిగిన వైనం..
వెంటనే క్యూలైన్ వద్దకి విజిలెన్స్ అధికారులు చేరుకొని భక్తుల్ని పక్కకు తీసుకెళ్లారు….
క్యూలైన్లో చిన్న పిల్లలతో వస్తున్న మహిళల ను తోటి భక్తులు తోసి వేశారన్న కారణంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. దీంతో అక్కడే ఉన్న అక్కడే ఉన్న విజిలెన్స్, పోలీస్ సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు వినకుండా ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ భక్తులకి ఎంత సర్ది చెప్పినా వినకుండా గొడవకు దిగడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. వెంటనే క్యూలైన్ వద్దకి చేరుకున్న విజిలెన్స్ అధికారులు భక్తుల్ని పక్కకు తీసుకెళ్లి సముదాయించి గొడవ సద్దుమణిగేలా చేశారు…