జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ భారీ ధర్నా..!

* తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తూ భారీ ధర్నా

* తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, నేడు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ధర్నా నిర్వహించనున్నారు.

* ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ రాహుల్ గాంధీ గారు విచ్చేసి ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, జిల్లా స్థాయి ప్రముఖ నేతలు, బీసీ నాయకులు పాల్గొననున్నారు.

* ఈ కార్యక్రమం ద్వారా బీసీల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పోరాట పటిమను మరోసారి నిరూపించబోతుంది.