28న గాంధీ చిత్రపతాలతో గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు..
_• ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి గాంధీ పేరును తొలగించినందుకు 28న నిరసన కార్యక్రమాలు.._
ఇప్పటకే జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన పీసీసీ
టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్*
*• జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది.*
ఏఐసీసీ పిలుపు మేరకు ఇప్పటికే జిల్లా కేంద్రాలలో మహాత్మా గాంధీ చిత్ర పటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది..
*టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్*
ఎన్నో ఉద్యమాల ఫలితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది.. మహేష్ కుమార్ గౌడ్..
ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్రం పక్కకు జరగాలని కుట్ర చేస్తుంది.
పేదలకు, గ్రామీణ ప్రాంత కూలీలకు ఎంతో భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నీరు గార్చాలని బీజేపీ కుట్ర చేస్తుంది.
అందుకు నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన తెలియజేయాలి..
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలి.
28న జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలి. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన ద్వారా తెలిపారు..