అసెంబ్లీ ఎన్నికలపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..!

*అసెంబ్లీ ఎన్నికలపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు…*

అక్టోబర్‌ 10 లోపు నోటిఫికేషన్‌ వస్తేనే సమయంలోపు ఎన్నికలన్న కేటీఆర్‌…

సమయంలోగా నోటిఫికేషన్‌ వచ్చేది అనుమానమేనన్న మంత్రి…

తెలంగాణలో ఎన్నికలు కూడా మేలో జరగవచ్చని కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు…

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఎన్నికలపై క్లారిటీ వస్తుందన్న కేటీఆర్‌…

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలను నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ‌ ఎన్నికలు ఒక్కసారి వచ్చిన, వేర్వేరుగా జరిగిన తమకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు… అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉందని అన్నారు. 90 స్థానాలకు పైగా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అవసరం రాష్ట్రానికి ఉందని క్షేత్రస్థాయి నుంచి ప్రజల ఫీడ్ బ్యాక్ వస్తుందన్నారు…