మరీ ఆలస్యం కాకముందే ఇరాన్ ఒక ఒప్పందం కుదుర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది”.. ట్రంప్..

“మరీ ఆలస్యం కాకముందే ఇరాన్ ఒక ఒప్పందం కుదుర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు..ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం విషయంలో మరీ ఆలస్యం చేస్తే పరిస్థితులు తీవ్రంగా మారిపోతాయని హెచ్చరించారు. అమెరికాతో ఒప్పందం కోసం …

ఇరాన్ లో పరిస్థితి చేయి దాటి పోతుందన్న అభిప్రాయంతో భారత్ ఆ దేశంలో ఉన్న తమ పౌరులను దేశం దాటిస్తోంది. విమాన సర్వీసులు లేకపోవడంతో భూమార్గంలో నిన్న ఉదయం నుంచి 1200 మందిని ఇరాన్ సరిహద్దులు దాటించింది. వీరిలో 800 మంది విద్యార్ధులు ఉన్నారు. వీరిలో 977 మందిని ఆర్మేనియా దేశంలోకి తీసుకెళ్లారు. మరో 194 మందిని అజర్బేజాన్ లోకి తీసుకొచ్చి, అక్కడ్నుంచి విమానాల్లో భారత్ కు తీసుకొస్తున్నారు.. పశ్చిమాసియాలో రాబోయే వారం రోజుల్లో యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉండబోతుందన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు..