పల్లెకు చేరని పల్లె వెలుగు బస్సు..!

పల్లెకు చేరని పల్లె వెలుగు బస్సు..

తీవ్ర ఇబ్బందులకి గురవుతున్న విద్యార్థులు, కూలీలు..

స్కూల్ కాలేజ్ పిల్లలు వృద్ధులు రోగులు డైలీ కూలీలు 4 గ్రామాల ప్రజల పడుతున్న తీవ్ర ఇబ్బందులు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు పేరుతో మహిళలకు అందిస్తూ పట్టణంలోకి అంకితమై ఉన్నాయి కనీసం పల్లెటూరికి పల్లె వెలుగు బస్సు రాకపోవడంతో పల్లెటూరు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు…

కరోనా కంటే ముందు హుజూర్నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు మీదుగా బస్సులు రాకపోకలు నిరంతరం నడిచేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు…

మఠంపల్లి మండలం రఘునాధపాలెం గుండ్లపల్లి.. చెన్నై పాలెం, రాఘవపురం. పలు గ్రామాలు…

హుజూర్నగర్, గరిడేపల్లి మండలలో..

సర్వారం లక్ష్మిపురం సీతారాంపురం కొండయిగూడెం గానుగబండా గ్రామాలకు RTC కోదాడ సూర్యాపేట డిపోల బస్ సౌకర్యం ఉండేది నిత్యం ప్రతి టిప్పు జనం తో పూర్తిగా బస్ మొత్తం కూడా నిండిపోయేది.
నష్టాలు రావడానికి కూడా ఆస్కారం లేకుండా ఉండేది..

ఇప్పుడు ఒక్క బస్ కూడా రావడం లేదు
స్కూల్, కాలేజ్ , స్టూడెంట్స్ తో పాటు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు..

కోదాడ హుజుర్నగర్ గడ్డిపల్లి గరిడేపల్లి సూర్యాపేట పట్టణాలల్లో ప్రభుత్వ స్కూల్ కాలేజ్ లల్లో ఫ్రీగా చదువుకునే అవకాశం ఉన్నా కూడా RTC బస్ సౌకర్యం లేక హాస్టల్స్ లో కానీ, పట్టణాల్లో రూమ్ తీసుకొని చదవాల్సిన పరిస్థితి వస్తోంది.. లేదా ఆటోకి చార్జీలిచ్చి ప్రయాణం చేయాల్సి వస్తుంది..

పేద పిల్లల తల్లి తండ్రులు అప్పులు తెచ్చి పిల్లల్ని చదివించడం చాలా దారుణంగా ఉందని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు..

మరికొంతమంది తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి అని ఆలోచనతో అప్పులు చేస్తూ ప్రెవేట్ స్కూల్ కాలేజ్ లల్లో లక్షలు పెట్టి హాస్టల్ కు పంపుతున్నారు…. మరి కొంతమంది స్కూల్ బస్సులు కాలేజీ బస్సులకు పరిమితమయ్యారు.

కొందరు చదువు మధ్యలోనే బంద్ చేస్తున్నారు..

డైలీ.

కూల్లీలు, వ్యాపారస్తులు , వృద్దులు , రోగులు, రైతులు వారి ఆవేదన వర్ణనాతీతం..
రహదారులు బాగా ఉన్నా కానీ ఆ దారిపై నడవడానికి పల్లె వెలుగు బస్సు మాత్రం రోడ్డు ఎక్కడం లేదు..
ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పల్లె వెలుగు బస్సులు పల్లెటూరికి చేరేలా చూడమని కోరుకుంటున్నారు..

మన మంత్రి ఉత్తమ్ సార్ మా విన్నపం వినండి అంటూ సోషల్ మీడియాలో విద్యార్థులు పలువురు విన్నపాలన వినిపిస్తూ పోస్ట్ చేస్తున్నారు..

ఉదయం ఒక్క ట్రిప్ 8 కి సాయంత్రం
5 లేదా 6 కి ఒక్క ట్రిప్ బస్సులోని నడపాలి అంటు గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు..