తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…!

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్ని నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.

నేడు పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటన.. స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. పలు‌ అభివృద్ది పనులు ప్రారంభించనున్న సీఎం.. బహిరంగ సభ అనంతరం కార్యకర్తలతో చంద్రబాబు భేటీ.. సీఎం పర్యటనతో భారీగా భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు..

హైదరాబాద్: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు.. 1100 ఫైల్స్ దగ్ధం అయినట్లు నాగ్ పూర్ ప్రత్యేక బృందం గుర్తింపు.. 1100 కేసుల డేటా రికవరీ కోసం యత్నం చేసిన బృందం.. కేసుల డేటా రికవరీ కష్టం అని తేల్చిన ప్రత్యేక బృందం..