టీటీడీ నెయ్యిలో జంతు కొవ్వు లేదని స్పష్టం చేసిన ఈడీ
సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ మరియు ఈడీ దర్యాప్తులోనూ టీటీడీ శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉపయోగించినట్లు ఆధారాలు లేవని స్పష్టం
ఈడీ దర్యాప్తులో నెయ్యిలో రసాయనాలు, వృక్ష ఆధారిత పదార్థాలతో కల్తీ చేసినట్లు నిర్ధారణ
జంతు కొవ్వు అంటూ ఇన్ని రోజులు భక్తుల మనోభావాలు దెబ్బతీసారని విమర్శలు..
TTD Ghee ED Probe | తిరుమల Tirumala శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై సుదీర్ఘంగా సాగుతున్న దర్యాప్తులో అత్యంత కీలకమైన, సంచలన పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ (TTD) నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు (Animal Fat) కలవలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) స్పష్టం చేసింది.
TTD Ghee ED Probe | సీబీఐ సిట్, ఈడీ విచారణలో తేలిందిదే!
కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఆధ్వర్యంలోని ప్రత్యేక విచారణ బృందం (SIT), ఈడీ నిర్వహించిన లోతైన దర్యాప్తులో శ్రీవారి ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వును కలిపినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టమైంది.
అయితే, ఈడీ దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. సరఫరా చేసిన నెయ్యిలో ప్రమాదకర రసాయనాలు (Chemicals), వృక్ష ఆధారిత పదార్థాల (Vegetable Oils/Fats) ద్వారా కల్తీకి పాల్పడినట్లు అధికారులు ఆధారాలతో సహా నిర్ధారించారు.
TTD Ghee ED Probe | భక్తుల మనోభావాలతో ఆటలాడారని ఆగ్రహం!
కాగా, శ్రీవారి ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ గత కొన్ని రోజులుగా జరిగిన ప్రచారంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజానిజాలు సరిగ్గా తెలుసుకోకుండా జంతు కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆధ్యాత్మికవేత్తలు, సాధారణ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, నెయ్యి కల్తీకి పాల్పడి భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించిన నిందితులు, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం అవుతోంది…