దూసుకొస్తున్న అకాల వర్షాలు….!

దూసుకొస్తున్న అకాల వర్షాలు..

నేటి నుంచి అంటే 16,17,18,19,20,21 తారీఖు ల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, వడగళ్ళు, గాలి దూమారాలతో కూడిన ఈ అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు భారీ నష్టం కలుగ జేసే అవకాశం వుంది. రైతులు & ప్రజలు అత్యంత అప్రమత్తంగా వుండవలసిన సమయం ఇది…రైతులు కళ్ళాలలో వున్న వరి పంటలను ఖాళీ చెయ్యడానికి, లేదా అనుకూల ప్రాంతాలలోకి తరలించడానికి చూడండి.
ఈ అకాల వర్షాలు లక్షణాలు అన్ని చోట్లా ఒకేలా వుండవు. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు తో
( ఎక్కువుగా తెలంగాణలో ) కొన్ని ప్రాంతాల్లో గాలి దుమారం తో, కొన్ని చోట్ల పిడుగులతో ..‌. ఇలా ఈ అకాల వర్షాలు వుండునున్నాయి. అప్రమత్తం గా వుండవలసిన సమయం ఇది.