తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య..!

తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య…

కులాంతర వివాహం చేసుకున్నారని చెల్లి భర్తను దారుణంగా చంపిన సోదరులు

నిన్న ఉదయం అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్న రాయపురం డిప్యూటీ తహసీల్దార్ సంధ్య(40), ద్వారపూడికి చెందిన సూర్యప్రకాష్ రావు(41)

ఇద్దరి కులాలు వేరు కావడంతో తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లి వద్ద బండిపై వెళ్తున్న నవ దంపతులను అడ్డుకుని, సూర్యప్రకాష్ రావును రాళ్లతో కొట్టి చంపిన సంధ్య సోదరులు..

అనంతరం నిందితులను చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు..

తన చెల్లిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కోపంతో సూర్య ప్రకాష్ (40) అనే యువకుడిని రాళ్ళతో కొట్టి హతమార్చారు. జెడ్. మేడపాడు గ్రామానికి చెందిన యువతి వేములపల్లికి చెందిన పోలపల్లి సూర్య ప్రకాష్‌ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం (ఫిబ్రవరి 26) అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. తన చెల్లిని ప్రేమ వివాహం చేసుకుని తమ కుటుంబం పరువు తీశాడనే నెపంతో సూర్య ప్రకాష్ హత్ కు పధకం రూపొందించారు యువతి అన్నదమ్ములు. స్థానికులు ఈ ఘటనను పరువు హత్య గా భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే వేములపల్లి వెళుతున్న తరుణంలో యువతి అన్నా, తమ్ముడబు దారి కాసి సూర్య ప్రకాశ్‌ను పట్టుకున్నారు. సూర్య ప్రకాష్‌ను తీవ్రంగా కొట్టి, రాళ్లతో మోదీ అత్యంత దారుణంగా హతమార్చారు. అనంతరం పారిపోయేందుకు యత్నిస్తున్న నిందితులను స్థానికులు పట్టుకుని స్తంభానికి కట్టేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హత్య చేసిన అన్నదమ్ములను, వారికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు..