ముందుగా ఆశీస్సులు తీసుకుంది త్రిష ఆశీస్సులు ఆయనకి కావాలి.. త్రిషపై ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ కామెంట్స్….
తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు నేరుగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి త్రిష వెళ్ళింది. స్వామివారి ప్రసాదాన్ని తీసుకొచ్చి నేరుగా విజయ్ కి అందించింది.
ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తల్లిదండ్రుల తర్వాత.. ముందుగా ఆశీస్సులు తీసుకుంది త్రిష నుంచే. ఆ సమయంలో చేసుకున్న భార్య లేదు. కన్న పిల్లలు లేరు. త్రిష మాత్రమే ఆయనకు అన్నీ అయిపోయింది. దీనిని బట్టి వారిద్దరి మధ్య ఎంత గాఢమైన బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల విజయ్ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు.. త్రిష పక్కనే ఉంది. పైగా ఆయనకు ఇష్టమైన కేకులు తీసుకొచ్చి ఆ సంబరాన్ని ఘనంగా జరిపింది…ఏ మనిషి అయినా సరే ప్రేమ విషయంలో.. ప్రేయసి విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఒకవేళ ఆమెకు ఏదైనా ఆపద వస్తే మరో మాటకు తావులేకుండా దూసుకుపోతాడు. అవసరమైతే ఆ పరిణామానికి కారణమైన వ్యక్తుల మీద దాడికి తెగబడతాడు. దీనికి విజయ్ కూడా మినహాయింపు కాదు. పైగా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి.
అప్పట్లో సనాతన ధర్మం మీద ఉదయనిది స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడాడు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. చివరికి హైకోర్టు కూడా అతడికి గడ్డి పెట్టింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఉదయ నిధికి బుద్ధి రాలేదు. పైగా ముఖ్యమంత్రి విమర్శించే కారణంతో అతడి ఏకంగా త్రిషపై మతిలేని వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో అతడిని తంజావూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై డీఎంకే ఆందోళనలు చేసినప్పటికీ.. విజయ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా ఉదయనిది అరెస్టును తమిళనాడులో అన్ని పార్టీలు స్వాగతించాయి. డీఎంకే మాత్రం ఈ అరెస్టును కక్షపూరితమైన చర్యగా భావించింది. పార్టీ కార్యాలయానికి స్టాలిన్ వెళ్లారు. పరిస్థితిని సమీక్షించారు. కార్యకర్తలతో మాట్లాడారు. వాస్తవానికి ఉదయనిధికి ఎలా మాట్లాడాలో తెలియదు. పైగా అతడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. కొన్ని సినిమాలలో నాయకుడిగా.. కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అయినప్పటికీ ఇలాంటి స్థాయి మరచి మాటలు మాట్లాడడం అతని వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. అంటు సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ అయ్యింది ..
మహిళల పట్ల ఇలాంటి భాష.
“ప్రజాక్షేత్రంలో ఉండే ఒక నాయకుడు మహిళల పట్ల ఇలాంటి భాష ఉపయోగించడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ప్రగతిశీల భావాలు ఉన్నాయని చెప్పుకునే ఉదయనిధి అసలు నైజం ఇదేనా?”, “వాళ్ల అమ్మ, కూతురు చాలా గర్వంగా ఫీల్ అవుతారు” అని నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిలదీస్తున్నారు.
త్రిషను లక్ష్యంగా చేసుకోవడం ఇది తొలిసారి కాదు.
స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం ఊపందుకున్నప్పటి నుంచి, త్రిషను దీనిలోకి లాగడం ఇది మొదటిసారి కాదు. గతంలో తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ కూడా విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ముందు ‘త్రిష ఇల్లు వదిలి బయటకు రావాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
స్పందించని త్రిష, విజయ్.
అప్పట్లో త్రిష లీగల్ టీమ్ ఈ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించింది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై నటి త్రిష గానీ, నటుడు విజయ్ గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి, బహిరంగ సభలో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటంపై మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.