Under 19 భారత క్రికెట్‌. 21 ఏళ్ల రికార్డు బద్దలు…!

Under 19 భారత క్రికెట్‌. 21 ఏళ్ల రికార్డు బద్దలు:-

దుబాయ్‌: అండర్‌-19 ఆసియా కప్‌లో భాగంగా యూఏఈ తో జరుగుతున్న మ్యాచ్‌ లో భారత్‌ 433/6 పరుగులు చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (171), ఆరోన్‌ జార్జ్‌ (69), విహాన్‌ మల్హోత్రా (69), వేదాంత్‌ త్రివేది (38) రాణించారు. యూఏఈ బౌలర్లలో ఉద్దిశ్‌, యుగ్‌ శర్మ చెరో 2 వికెట్లు పడగొట్టారు. షాలమ్‌ డిసౌజా, యాయిన్‌ రాయ్‌ చెరో వికెట్‌ తీశారు. అండర్‌ 19 క్రికెట్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2004 లో చేసిన 425 పరుగుల రికార్డు ఈరోజు బద్దలైంది..