భారతీయ సిబ్బంది నౌకపై అమెరికా దాడి..!

అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ క్రమంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై అమెరికా దాడి చేయడంతో అందులోని ముగ్గురు భారతీయ సిబ్బంది గల్లంతయ్యారు. కనిపించకుండా పోయిన ఆ ముగ్గురూ చనిపోయినట్టు కేంద్రం ప్రకటించింది. వీరిలో ఒకరు విశాఖకు చెందిన మెరైన్ ఇంజినీర్ సురేష్ ఉన్నట్టు తాజాగా వెల్లడయ్యింది..

ఒమన్‌ తీరం (Oman Coast) లో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్నసెటెబె వాణిజ్య నౌకపై అమెరికా (USA) బుధవారం జరిపిన దాడి కలకలం సృష్టించింది. దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా వారిలో ముగ్గురు నావికులు (Three Sailers) ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని షిప్పింగ్ మినిస్టర్ (Shipping Minister) సర్బానంద సోనోవాల్ (Sarbananda Sonoval) ధ్రువీకరించారు. ఇది విషాదకరమైన ఘటన అని, ఆ ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతులను డెక్‌ క్యాడెట్‌ ఆదిత్య శర్మ, ఇంజిన్‌ ఫిట్టర్‌ శివానంద్ చౌరాసియా, చీఫ్‌ ఇంజినీర్‌ పట్నాల సురేశ్‌గా గుర్తించారు…తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్‌ నుంచి చమురు రవాణా చేసేందుకు ప్రయత్నించినందుకే ట్యాంకర్‌పై కాల్పులు జరిపామని అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యపై ఆగ్రహం వ్యక్తంజేసింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆపేయాలని, అంతర్జాతీయ జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛగా జరగాలని పేర్కొన్నది. అంతేగాక ఢిల్లీలో అమెరికా దౌత్యాధికారి జేసన్‌ మీక్స్‌ను పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. 24 మంది భారతీయులున్న మారివెక్స్‌ నౌకపై ఒమన్‌ తీరంలో అమెరికా నౌకాదళం మూడు రోజుల కిందట దాడి చేసింది.

ఇదిలావుంటే భారతీయ సిబ్బంది ఉన్న మరో నౌకపై తాజాగా దాడి జరిగింది. ఒమన్ తీరంలో ఆ నౌకపై అమెరికా మిలిటరీ దాడి చేసింది. వారం రోజుల వ్యవధిలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడి చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తాజా ఘటనను ఒమన్‌లోని భారత ఎంబసీ వెల్లడించింది. ఇవాళ ఉదయం ఒమన్‌లోని షినాస్‌ పోర్టు సమీపంలో నౌకపై దాడి జరిగిందని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నది.ఆ నౌక పేరు జలవీర్‌ అని తెలుస్తోందని వెల్లడించింది.