ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. దక్షిణ కొరియా అమెరికాతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తుండటంతో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమను రెచ్చగొట్టే చర్య అని మండిపడ్డారు. ఈ చర్యకు ప్రతిగా అణ్వాయుధాలను పెంచుతానని కిమ్ హెచ్చరించారు….ప్రధాన ఆయుధాల కర్మాగారాలను తనిఖీ చేసేందుకు వచ్చిన సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ దాదాపు 80 ఏళ్లుగా మన పాలన, సామాజిక వ్యవస్థను కూలదోయడానికి దక్షిణ కొరియా ఘర్షణ చరిత్రను అనుసరిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా మార్చలేని వాస్తవాన్ని గుర్తించాలని చారిత్రక సమస్యను సరిగ్గా పరిష్కరించాలని సుప్రీం నాయకుడు అన్నారు. ఈ క్రమంలో కిమ్ జోంగ్ ఉన్ దక్షిణ కొరియాను ప్రధాన శత్రువుగా ప్రకటించారు…