వైభవ్ కు 18 ఏళ్లుంటే నష్టమేంటి?.. కుర్రాడి ఆట అద్భుతం : బ్రెటీలీ

వైభవ్ కు 18 ఏళ్లుంటే నష్టమేంటి?.. కుర్రాడి ఆట అద్భుతం : బ్రెటీలీ

వైభవ్ సూర్యవంశీ వయసుపై విదేశాల్లో ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయని ఆసీస్ మాజీ బౌలర్ బ్రెటీ చెప్పారు. ఆయన భారత్కు దొరికిన టాలెంటెడ్ ప్లేయర్ అని కొనియాడారు. ‘వైభవ్ వయసు 15 ఏళ్లు అయితే అద్భుతం. ఒకవేళ 17-18 ఏళ్లయినా నష్టమేముంది? కుర్రాడు అద్భుతమైన క్రికెటర్.

IPLలో SRHపై చేసిన 97 పరుగుల ఇన్నింగ్స్ నన్ను ఎంతో ఆకట్టుకుంది. నిప్పులు చెరిగే బంతులను సునాయాసంగా ఆడారు’ అని పేర్కొన్నారు..

భారత్ బయట, ప్రపంచవ్యాప్తంగా అందరూ వైభవ్ వయసు నిజంగా 15 ఏళ్లేనా? అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే అతిపెద్ద టాకింగ్ పాయింట్. కానీ, అతడి వయసు ఎంతైతే నాకేంటి? 15 అయినా, 17 లేదా 18 అయినా పర్వాలేదు. ఈ కుర్రాడు అద్భుతంగా క్రికెట్ ఆడగలడు. భారత క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆటగాడు. భవిష్యత్తులో అతను మరెన్నో గొప్ప విజయాలు సాధించబోతున్నాడు” అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన భయంలేని ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. బౌలర్ల పేరు, ప్రతిష్ఠ‌లతో సంబంధం లేకుండా తనదైన శైలిలో భారీ షాట్లతో చెలరేగాడు. అతని అసాధారణమైన బ్యాట్ స్పీడ్, దూకుడైన బ్యాటింగ్ అతన్ని టోర్నమెంట్‌లోని యువ స్టార్ల‌లో ఒకడిగా నిలబెట్టాయి. ఐపీఎల్‌లో కనబరిచిన ఈ అద్భుత ప్రదర్శనతోనే, అతనికి భారత టీ20 జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పెద్దగా రాణించకపోయినా, జింబాబ్వే పర్యటనలో అద్భుతంగా పుంజుకుని ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఇది ఎటువంటి ఒత్తిడిలోనైనా రాణించగల అతని సామర్థ్యాన్ని తెలియజేసింది.

వైభవ్ బ్యాటింగ్‌లోని పరిణతిని బ్రెట్ లీ ప్రత్యేకంగా ప్రశంసించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతను చేసిన 97 పరుగుల ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకున్నాడు. “ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేస్తుంటే, వైభవ్ ఏమాత్రం భయపడకుండా తన ముక్కు మీదుగా హుక్ షాట్లు ఆడాడు” అని కొనియాడాడు. అయితే, ఇంత చిన్న వయసులో అనూహ్యంగా వచ్చిన పేరు ప్రఖ్యాతులు, అంచనాలను తట్టుకుని నిలబడటమే అతడి ముందున్న అతిపెద్ద సవాల్ అని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.