ట్రంప్‌ కు షాక్….ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి వెనెజులాకు చెందిన మరియా కొరినా మచాడో..!

Venezuela’s Maria Corina Machado.

ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారానికి వెనెజులాకు చెందిన మరియా కొరినా మచాడో ఎంపికయ్యారు. ఈ మేరకు స్వీడిష్‌ అకాడమీ ఓ ప్రకటన చేసింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజల తరఫున పోరాటం చేసినందుకు ఆమెను ఈ అవార్డ్‌కు ఎంపిక చేసినట్లు తెలిపింది. వెనెజులా నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య దేశంగా మారేందుకు శాంతియుత పోరాటం చేశారని ప్రశంసించింది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, గత ఏడాది కాలంగా అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని తెలిపింది. వెనెజువెలా సైనికీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె, శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యం కోసం కృషిచేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని నోబెల్‌ కమిటీ కొనియాడింది..మరియా ప్రస్తుతం వెనెజులా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2011 నుంచి 2014 వరకు వెనెజులా జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా ఉన్నారు. 2002లో మరియా రాజకీయ అరంగేట్రం చేశారు. 2012లో వెనెజుల అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఆమె ఓటమిపాలయ్యారు. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్‌ కాగా, అకాడమీ సభ్యులు మరియా వైపు మొగ్గుచూపారు.

నోబెల్‌ శాంతి బహుమతిని 1901 నుంచి ఇప్పటివరకు 105 సార్లు ప్రకటించారు. ఇందులో 111 మంది వ్యక్తులు, 31 సంస్థలు ఇప్పటివరకు నోబెల్ పురస్కారాన్ని అందుకున్నాయి. గతేడాది హిరోషిమా, నాగసాకిల్లో అణుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతోన్న జపాన్‌కు చెందిన నిహాన్‌ హిడాంక్యో సంస్థకు నోబెల్‌ శాంతి పురస్కారం దక్కింది. ఈ అవార్డు అందుకున్న అతిపిన్న వయస్కురాలిగా పాకిస్థాన్‌కు చెందిన హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ నిలువగా, జోసెఫ్‌ రాట్‌బ్లాట్‌ 86 ఏళ్ల వయసులో దీనిని అందుకున్నారు..