2023లో కోలీవుడ్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విడుదలై పార్ట్ 1’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో సూరి ప్రధాన పాత్రలో నటించిన విడుదలై పార్ట్ 1 సినిమాలో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్లో కనిపించారు. మొదటి పార్ట్కి మంచి స్పందన రావడంతో సెకండ్ పార్ట్ని ఎక్కువ సమయం తీసుకుని, ఎక్కువ బడ్జెట్తో దర్శకుడు వెట్రిమారన్ రూపొందించారు. దాదాపు ఏడాది కాలం పాటు పార్ట్ 2 రూపొందింది. గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విడుదలై పార్ట్ 2 సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది..విడుదలై పార్ట్ 2 గత ఏడాదిలో కోలీవుడ్ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ. వెట్రిమారన్, విజయ్ సేతుపతి అభిమానులతో పాటు తమిళ్ ప్రేక్షకులు ఇతర భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా విడుదల పార్ట్ 2 కోసం ఎదురు చూశారు. కానీ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. రన్ టైమ్ విషయంలోనూ సినిమా విమర్శలు ఎదుర్కొంది. విడుదలకు ముందే రన్ టైమ్ను కుదించినా ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి సినిమా థియేట్రికల్ రిలీజ్లో హిట్ కొట్టలేదు. కానీ ఓటీటీ లో సినిమాను చూడటం కోసం వెట్రిమారన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.