విజయ్ దేవరకొండ పై ఎఫ్ఐఆర్ నమోదు..

విజయ్ దేవరకొండ పై ఎఫ్ఐఆర్ నమోదు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు

రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యల నైపథ్యంలో నమోదు

500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు అంటూ విజయ్ దేవరకొండ వివాదస్పద వ్యాఖ్యలు

గిరిజన సంఘాల ఆందోళనతో కేసు నమోదు చేసిన పోలీసులు..

ఫ్యామిలీ స్టార్‌.. రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ చిక్కుల్లో పడ్డారు. ఓ సినిమా వేడుకలో చేసిన ప్రసంగం కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సమాజాన్ని కించపర్చారని.. విజయ్‌ వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వర్గానికి చెందిన వారు విజయ్‌ దేవరకొండకు వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా విజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీ హీరోపై కేసు నమోదవడంతో రాజకీయంగా.. సినీ పరిశ్రమలోనూ కలకలం రేపుతోంది..