టీడీపీకి ఓటేస్తే నారా లోకేష్ 2029లో CM అవుతాడు : విజయసాయి రెడ్డి

టీడీపీకి ఓటేస్తే నారా లోకేష్ 2029లో CM అవుతాడు : విజయసాయి రెడ్డి

గత ప్రభుత్వంలో అన్ని కులాల కార్పొరేషన్లను ఇచ్చిందని, ఈ ప్రభుత్వం ఇంకా రెడ్డీ కార్పొరేషన్ పదవుల్ని భర్తీ చేయలేదన్నారు. తక్షణమే రెడ్డి కార్పొరేషన్ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. రాష్ట్రం విభజన తర్వాత రాయలసీమకు ఎన్ని నీటి ప్రాజెక్టులు వచ్చాయి? ఏదైనా అభివృద్ధి జరిగిందా? అంటూ సీఎం చంద్రబాబు, జగన్‌లను ప్రశ్నించారు. గడిచిన పుష్కరకాలంగా ఈ రెండు కుటుంబాలు రాష్ట్రాన్ని పాలించాయని గుర్తు చేశారు.

టీడీపీ-వైసీపీని దూరం పెట్టాలని ప్రజలకు పిలుపు
ఈ రెండు కుటుంబాలకు రాయలసీమ పట్ల నిజమైన ప్రేమ ఉందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. ఓట్ల కోసం రాయలసీమ, రెడ్లు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సీమకు చెందిన నేతలు ముఖ్యమంత్రులు అయ్యారని, అక్కడ ఆస్తుల్ని పెంచుకున్నారని, అభివృద్ధి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ గడ్డ కోసం పోరాటానికి యువత ముందుకు రావాలని, వ్యక్తుల అభివృద్ధికి రక్తం చిందించాల్సిన అవసరం లేదున్నారు. సీమ ఒడంబడిక ఏమైందని ప్రశ్నించారు. అత్యధికంగా వలస పోయేది ఈ ప్రాంత ప్రజలేనని అన్నారు..

టీడీపీకి ఓటేస్తే నారా లోకేష్ 2029లో CM అవుతాడు .

ప్రస్తుతం రాష్ట్రం ఇబ్బందికి కూటమి ప్రభుత్వం కారణం అన్నారు… మళ్ళీ టీడీపీ కి 2029లో ఓటు వేస్తే లోకేష్ CM అవుతాడు అప్పుడు రాష్ట్రం పరిస్తితి ఎలా ఉండబోతుంది ప్రజలే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అన్నారు..