యువతి విషయంలో వివాదం జీప్ లతో ఢీ కొట్టుకున్న ఇద్దరు యువకులు..!
ఆంధ్రప్రదేశ్ :ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన వివాదం రోడ్డుపై బీభత్సానికి దారి తీసింది…
రోహిత్ (పెనమలూరు), బొల్లా ఓమ్ (విజయవాడ) కు యువతి విషయంలో గొడవ రావడంతో సవాళ్లు విసురుకున్నారు. నిన్న రాత్రి పటమట హైటెన్షన్ రోడ్డులో థార్ జీప్లతో ఢీకొట్టుకుంటూ హల్చల్ చేశారు. తర్వాత రాడ్లతో కార్ల అద్దాలను పగలగొట్టుకున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…
ఈ ఘటనపై ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు.. బడా బాబులు పైసలు ఎక్కువై హైటెక్ తరహాలో దాడులు చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు.. ఇలా స్టంట్ లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయాలని సోషల్ మీడియాలో మెసేజ్లు వైరల్ గా మారింది..