హీరో విజయ్ దేవరకొండకు కారు ప్రమాదం
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఘటన
తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఘటన
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ విజయ్
స్వల్పంగా ధ్వంసమైన విజయ్ కారు
స్నేహితుడి కారులో అక్కడి నుంచి వెళ్లిన విజయ్...
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి తిరిగి వస్తుండగా… జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో హీరో విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కారు స్వల్పంగా దెబ్బతింది. బొలెరో కారు అకస్మాత్తుగా టర్న్ తీసుకుంటూ వెనుక నుంచి వస్తోన్న విజయ్ కారును ఢీకొట్టింది…ప్రమాదం తర్వాత విజయ్ స్నేహితుడి కారులో అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆదివారం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి సమాధిని దర్శించుకునేందుకు వెళ్లిన విజయ్… సోమవారం ఉదయం సమాధిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..