భారత్ ఆర్మీ బేస్‌లను ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుంది
భారత్ ఆర్మీ బేస్‌లకు ఎక్కడా నష్టం జరగలేదు – విక్రమ్ మిస్రీ
ఇండియాకి చెందిన ఆర్మీ మరియు ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొడుతూ ఎయిర్ బేస్‌లకు చెందిన తాజా చిత్రాలను విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ..
సిర్సా, సూరత్‌గఢ్ ఎయిర్ బేస్‌ల ఫోటోలు విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ…
గత కొద్దిరోజులుగా సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు పెరిగాయి. జమ్మూ సమీపంలోని సరిహద్దు ప్రాంతాల నుంచి ట్యాబ్ – లాంచెడ్ డ్రోన్లను ఉపయోగించి మనదేశ భూభాగంలోకి గూఢచర్యం, దాడులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నిఘావర్గాల ద్వారా సమాచారం రావడంతో.. భారత ఆర్మీ దృష్టిసారించింది. ఉగ్రవాదులకు స్థావరంగా మారిన సరిహద్దు ప్రాంతాల్లోని లాంచ్ ప్యాడ్ లపై గురిపెట్టి మెరుపుదాడులు చేసింది. దీంతో లాండ్ ప్యాడ్ లు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇప్పుడు లాంచ్‌ప్యాడ్‌ను ధ్వంసం చేయడంతో వారి మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలకు భారీ దెబ్బ తగిలిందని పోస్టులో భారత ఆర్మీ తెలిపింది.