నేటి నుండి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ
హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
పాల్గొననున్న వెయ్యి మందికి పైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు
పోటీల్లో పాల్గొంటున్న 120 దేశాల కంటెస్టెంట్స్.. ఇప్పటికే 109 దేశాల నుంచి రాక
స్టేడియం, కంటెస్టెంట్లు బస చేస్తున్న ట్రైడెంట్ హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం….
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ సిందూర్, భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా ఉన్న స్లీపర్‌సెల్స్ నిద్ర లేచాయని, ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని కేంద్ర హోంశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు తెలిసింది. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా ఉగ్రదాడులు ఉండవచ్చని, ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ అందాల పోటీల నిర్వహణ మీద స్లీపర్‌సెల్స్ దృష్టి సారించే ప్రమాదం ఉన్నదని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అవుట్డోర్ ప్రాంతాల్లో నిర్వహించే అందాల పోటీల ఈవెంట్స్‌ను డేగ కండ్లతో నిశితంగా గమనించాలని ఆదేశించినట్టు సమాచారం. స్థానిక పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే స్థానిక సైన్యం సహకారం తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో అందాల పోటీలకు మూడు వారాలపాటు పూర్తిస్థాయి భద్రత కల్పించడం తెలంగాణ పోలీసులకు పెద్ద సవాల్ కానున్నది…
నేటి నుంచి ప్రపంచ అందాల పోటీలు.. పాల్గొననున్న 110దేశాల అందాల భామలు
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రపంచ అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి. సుమారు 110దేశాలకు పైగా సుందరాంగులు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు. పోటీలకు సర్వం సిద్ధం చేసినట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఇప్పటికే రిహార్సల్స్ పూర్తయ్యాయని, పోటీలకు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు