వినాయకునికి గుంజీలు అంటే ఎందుకంత ఇష్టం? గుంజీలు తీయడం వెనుక ఏదైయినా శాస్త్రీయత ఉందా!.

దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పందిళ్లల్లో రకరకాల స్వరూపాలతో వెలసిన గణపతి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టమైన దైవం గణపతి. వినాయకుని ప్రార్ధిస్తే విఘ్నాలు తొలగుతాయి. అయితే గణపతిని దర్శించే సమయంలో పెద్దా చిన్నా భేదం లేకుండా భక్తులు గుంజీలు తీస్తుంటారు. అసలు వినాయకునికి గుంజీలు అంటే ఎందుకంత ఇష్టం? గుంజీలు తీయడం వెనుక ఏదైయినా శాస్త్రీయత ఉందా! ఈ విషయాలు తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.

విఘ్నాధిపతి వినాయకుడు..

వినాయకుని పూజిస్తే ఏ పనిలోనూ ఆటంకాలు ఉండవని అందరూ నమ్ముతారు. కొంతమంది ప్రతిరోజూ వినాయకుని దర్శించనిదే ఎలాంటి పనులు మొదలు పెట్టరు. ముఖ్యంగా ద్రవిడ సంప్రదాయం పాటించేవారు పెద్దలైనా, పిల్లలైనా వినాయకుని ఆలయాన్ని దర్శించనిదే కార్యాలయాలకు కానీ, పాఠశాలలకు కానీ వెళ్లరు.

నిత్య పూజనీయుడు వినాయకుడు
ఉదయం తొందరలో పెద్దగా పూజలవి చేయలేక పోయినా వినాయకుని ముందు కనీసం మూడు గుంజీలు తీసి తమ రోజువారీ పనులకు వెళ్లే వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

కైలాసం వెళ్లిన విష్ణుమూర్తి
ఒకసారి శ్రీమహావిష్ణువు శివుని దర్శనం కోసం కైలాసం వెళ్లాడు. శివ దర్శనం అయిన తర్వాత విష్ణువు తన శంఖ చక్ర గదాయుధాలన్నీ పక్కన పెట్టి శివునితో కూర్చొని లోకాభిరామాయణం మొదలుపెడతాడు.

వినాయకుని ఆకర్షించిన సుదర్శన చక్రం
శివుడు విష్ణువు సంభాషణల్లో మునిగి ఉండగా అటుగా వచ్చిన బాల గణపతి స్వర్ణ కాంతులతో ధగధగలాడుతున్న సుదర్శన చక్రాన్ని చూసి ముచ్చటపడి దానిని చేతిలోకి తీసుకొని అమాంతం మింగేస్తాడు. ఈ విషయాన్ని శివుడు కానీ విష్ణువు కానీ గమనించరు.

సుదర్శన చక్రం కోసం వెతుకులాట
కొంచెంసేపు తర్వాత విష్ణువు తన ఆయుధాలు ఉంచిన చోట చూస్తే సుదర్శన చక్రం కనబడదు. అప్పుడు విష్ణువు సుదర్శన చక్రం కోసం కైలాసమంతా వెతకసాగాడు. అప్పుడు బాల గణేశుడు దేనికోసం వెతుకుతున్నావని విష్ణువును అడగగా, సుదర్శన చక్రం కనబడటం లేదని విష్ణువు చెబుతాడు. అప్పుడు గణేశుడు సుదర్శన చక్రాన్ని తానే మింగేసానని చెబుతాడు.

గణేశుని బతిమాలాడిన విష్ణుమూర్తి.

తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇచ్చేయమని బాల గణపతిని విష్ణుమూర్తి ఎంతగానో బుజ్జగించి అడుగుతాడు. కానీ గణపతి ఇవ్వడు. ఆ సమయంలో గణేశుని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణుమూర్తి కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీస్తాడు.