వినుకొండ సీఐ చిన్న మల్లయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది…బెడ్ పై ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న దృశ్యాలు..
వినుకొండ సీఐ చిన్న మల్లయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు సంబంధించిన ఓ రాసలీలల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెడ్ పై ఓ మహిళతో ఆయన సన్నిహితంగా ఉన్న దృశ్యాలు బయటకు రావడంతో పోలీస్ శాఖలో కలకలం రేగుతోంది.
చిన్నమల్లయ్యపై సంచలన ఆరోపణలు..
ఇంతకు ఏం జరిగిందంటే..వినుకొండకు చెందిన ధనలక్ష్మి అనే మహిళ సీఐ చిన్నమల్లయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఆయన అఘాయిత్యానికి పాల్పడ్డారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. చిన్నమల్లయ్య మరో మహిళతో సన్నిహితంగా ఉండగా ధనలక్ష్మి స్వయంగా వీడియో తీశారు. తన బాగోతాన్ని వీడియో తీస్తున్నారన్న కోపంతో చిన్నమల్లయ్య తనపై భౌతిక దాడికి దిగారని ధనలక్ష్మి ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వినుకొండ పోలీసులు చిన్నమల్లయ్యపై కేసు నమోదు చేశారు…
సు విషయం తెలుసుకున్న చిన్నమల్లయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గతంలో ఆయన సీఐడీలో పనిచేశారు. అయితే వరుస వివాదాల కారణంగా ప్రస్తుతం ఆయన వీఆర్ లో ఉన్నారు. ఇప్పుడు తాజా వీడియో లీక్ అవ్వడం, కేసు నమోదు కావడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. చిన్నమల్లయ్యపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఆయన ట్రాక్ రికార్డు చూస్తే వరుస వివాదాలు కనిపిస్తున్నాయి. 2024లో కారంపూడిలో ఒక టీడీపీ నేతను గన్తో బెదిరించినట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఒక మహిళతో ఉన్న వీడియో వైరల్ అవ్వగా, ఇప్పుడు రెండో వీడియో కూడా బయటకు రావడంతో శాఖాపరమైన విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది.
శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీసు అధికారి, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. పరారీలో ఉన్న చిన్నమల్లయ్య దొరికితేనే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.