విశాఖలో YCP కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్.!

విశాఖలో YCP కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్.

గాజువాకలో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఇంట్లో సమావేశం. సమావేశానికి వచ్చిన మాజీ మంత్రులు అంబటి, గుడివాడ, ఇతర మాజీ ఎమ్మెల్యేలు. అంబటి అరెస్ట్, ఇటీవల పరిణామాలపై సమావేశంలో చర్చ.

బీహార్ రాజకీయాల్లో ముగిసిన నితీశ్ కుమార్ శకం.. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్న బీహార్ సీఎం. సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీశ్ కుమార్. బీహార్ సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీశ్ కుమార్. పదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్ కుమార్. బీహార్ సీఎంగా BC నేతను పెట్టే యోచనలో బీజేపీ. JDU పార్టీ సభ్యత్వం నేడు స్వీకరించనున్న సీఎం నితీశ్ కుమారుడు నిశాంత్ కుమార్. నేడు పాట్నాకు అమిత్ షా, కొత్త సీఎంపై నిర్ణయం.

అమరావతి: క్వశ్చన్ అవర్లో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు.. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారు. కానీ ఎస్టీ హాస్టళ్లలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఎస్టీ హాస్టళ్లలో సరైన సౌకర్యాలు లేక పిల్లలు నేలపై పడుకుంటున్నారు. ఎస్టీ హాస్టళ్లపై మంత్రి డోలా దృష్టి పెట్టాలి: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు