విశాఖలో స్వల్ప భూకంపం.

విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. 2025 నవంబర్ 04వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4.16 నుంచి 4.20 గంటల మధ్య గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలీ, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం, తదితర ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి…అకస్మాత్తుగా సంభవించిన భూకంపం కారణంగా ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
స్వ‌ల్పంగా భూమి కంపించింది. అక్క‌య్య‌పాలెం, మ‌ద్దిల‌పాలెం, ఎంవీపీకాల‌నీ, బీచ్‌రోడ్డు, మ‌ధుర‌వాడ‌, తదిత‌ర ప్రాంతాల్లో భూమి కంపించింద‌ని విశాఖ వాతావ‌ర‌ణ కేంద్రం మంగ‌ళవారం నిర్థారించింది..
భూకంప తీవ్రత వివరాలు తెలియాల్సి ఉంది..