ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో కీలక అప్డేట్ తీసుకొచ్చింది. ముఖ్యంగా గ్రూప్ చాట్లను ఉపయోగించేవారికి సంభాషణలు మరింత సులభంగా మారేలా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. గ్రూపుల్లో రోజూ వందలాది మెసేజ్‌లు వస్తుంటాయి. వాటి మధ్య ముఖ్యమైన సమాచారాన్ని వెతకడం, మనకు వచ్చిన మెన్షన్లను గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఈ సమస్యలను తగ్గించడంతో పాటు గ్రూప్ సభ్యుల మధ్య సంభాషణలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మెటా నాలుగు కొత్త ఫీచర్లను ప్రకటించింది..
వాట్సాప్ వినియోగదారులకు మరో ఆసక్తికరమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. మెసేజ్‌లు చదివినట్లు ఎదుటివారికి బ్లూ టిక్స్ కనిపించకుండానే.. వాటిని చూసే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. ‘చాట్ ప్రివ్యూ’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్లో టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది…
ప్రత్యేకత ఇదే..!
వాట్సాప్ చాట్ లిస్ట్‌లోని పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌పై కొద్దిసేపు నొక్కి ఉంచితే.. ప్రత్యేక ప్రివ్యూ విండో ఓపెన్ అవుతుంది. అందులో తాజాగా వచ్చిన సందేశాలను చూడటం సహా స్క్రోల్ చేసి మరిన్ని మెసేజ్‌లను చదవొచ్చు. ఇందుకోసం చాట్‌ను ఏమాత్రం తెరవాల్సిన అవసరముండదు. దీంతో సందేశాలు చదివినప్పటికీ సాధారణంగా కనిపించే బ్లూ టిక్స్ అవతలివాళ్లకు కనిపించదు..ప్రివ్యూ విండోలో సందేశాలు చూడటమే కాకుండా.. అదే సమయంలో మరికొన్ని పనులూ చేసుకోవచ్చు. చాట్‌ను రీడ్‌గా గుర్తించడం, పిన్ చేయడం, ఆర్కైవ్‌లోకి పంపడం, సెలెక్ట్ చేయడం, డిలీట్ చేయడం వంటి ఆప్షన్లూ ఉండనున్నాయి. అదనంగా చాట్ లాక్, సమాచారం తెలుసుకోవడం, హోమ్ స్క్రీన్‌పై షార్ట్‌కట్ ఏర్పాటు వంటి సదుపాయాలు కూడా వచ్చే అవకాశముంది.
చాట్ హిస్టరీ షేరింగ్ (Chat History Sharing): గ్రూప్‌లో కొత్తగా చేరిన సభ్యులకు అంతకుముందు జరిగిన పాత మెసేజ్‌లను సులభంగా షేర్ చేయవచ్చు..