500 నోట్ల గురించి సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.500 నోటు రద్దు చేయాలని కోరారు. రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాని డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలనకు డిజిటల్ కరెన్సీ ఉత్తమమని, డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలని సూచించారు. ఈ మేరకు దీని గురించి ప్రధాని మోదీని డిమాండ్ చేస్తూనే ఉంటానని, టెక్నాలజీ బాగుంటే సంపద సృష్టి జరుగుతుందని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన కష్టం కాదని చంద్రబాబు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై స్పందించేందుకు సోమవారం అమరావతిలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు..
వాటి స్థానంలో రూ.100, రూ.200 నోట్లతో పాటు డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూనే ఉంటానని స్పష్టం చేశారు. టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకుంటే సంపద సృష్టి సాధ్యమవుతుందని, పేదరికాన్ని నిర్మూలించడం కూడా కష్టమైన పని కాదని అభిప్రాయపడ్డారు. గతంలోనూ నోట్ల రద్దుపై తన అభిప్రాయాలను వెల్లడించిన చంద్రబాబు తాజా వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి..
సోమవారం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన ఆయన.. రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గాలని, సేవాభావమే ప్రజాప్రతినిధులకు ప్రధాన లక్షణంగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో నగదు పంపిణీని చాలావరకు తగ్గించినప్పటికీ కూటమి ఘన విజయం సాధించిందని తెలిపారు. అవినీతిని అరికట్టేందుకు పెద్ద నోట్ల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీలను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే రూ.500 నోట్ల రద్దు, డిజిటల్ కరెన్సీ ప్రోత్సాహంపై ప్రధాని మోదీకి తన విజ్ఞప్తిని కొనసాగిస్తానని చెప్పారు.