శరీర భాగాలతో బిర్యానీ వండిన రాక్షసులు..!

చెన్నై నగరంలో మానవత్వానికే మాయని మచ్చ తెచ్చే అత్యంత కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. తోడుగా ఉంటున్న ఓ మహిళను దారుణంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి బిర్యానీ వండిన భయానక ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. మిగిలిన భాగాలను సూట్‌కేసులో ప్యాక్ చేసి రైలులో వదిలేశారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తర్‌ప్రదేశ్ ఆగ్రా స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఈ ఘాతుకం వెలుగుచూసింది. ఒక జనరల్ కంపార్ట్‌మెంట్‌లో తీవ్ర దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోగీలో తనిఖీలు చేపట్టిన పోలీసులు సీటు కింద ఉన్న ఎరుపు రంగు సూట్‌కేస్‌ను బయటకు తీశారు. దానిని తెరిచి చూసిన అధికారులకు వెన్నులో వణుకు పుట్టింది. అందులో ఒక మహిళ శరీర భాగాలు ముక్కలుగా నరికి ప్యాక్ చేసి ఉన్నాయి.

బిర్యానీ పాత్రలో శరీర భాగాలు.. పోలీసులే షాక్

పోలీసులు గూడువాంచేరిలోని అనుమానితుల ఇంటికి చేరుకుని చూసేసరికి తాళం వేసి ఉంది. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా ఇల్లంతా రక్తసిక్తంగా మారింది. వంటగదిలో దమ్ బిర్యానీ కోసం మూతపెట్టి, చుట్టూ మైదా పిండితో సీల్ చేసిన ఒక పెద్ద పాత్ర కనిపించింది. పోలీసులు అనుమానంతో ఆ పాత్ర మూత తీసి చూడగా రైస్‌తో పాటు మహిళ శరీర భాగాలు ఉడికించి ఉండటం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ పాత్రను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షల కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో విస్తుపోయే నిజాలు.. బిర్యానీ పాత్రలో శరీర భాగాలు
పోలీసులు గూడువాంచేరిలోని అనుమానితుల ఇంటిని గుర్తించి అక్కడికి చేరుకున్నారు. తాళం వేసి ఉండటంతో తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా, ఇల్లంతా రక్తపు మరకలు దర్శనమిచ్చాయి. వంటగదిని పరిశీలించిన అధికారులకు దమ్ బిర్యానీ కోసం మూతపెట్టి, చుట్టూ మైదా పిండితో సీల్ చేసిన ఒక పెద్ద బిర్యానీ పాత్ర కనిపించింది. పోలీసులు అనుమానంతో ఆ పాత్ర మూత తీసి చూడగా రైస్‌తో పాటు మహిళ శరీర భాగాలు ఉడికించి ఉండటాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పోలీసులు ఆ పాత్రను స్వాధీనం చేసుకుని వెంటనే ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షల నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరారీలో నిందితులు.

హత్యకు గురైన మహిళను ఒడిశాకు చెందిన హయూత్ నిషాగా గుర్తించారు. ఆమె గతంలోనే భర్తతో విడిపోయి జీవిస్తోంది. ఆమె 19 ఏళ్ల కుమారుడు చెన్నై తాంబరంలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఒడిశాకే చెందిన మాజేద్ ఉద్దిన్ లస్కర్, అతని భార్య బాగమతి మాజీలతో కలిసి నిషా గూడువాంచేరిలో నివసిస్తోంది. స్థానికులకు వీరిని తన తమ్ముడు, మరదలు అని ఆమె పరిచయం చేసినట్లు తెలిసింది.
అగ్ర వీడియోలు