ఆసియా కప్ ఫైనల్‌కు శ్రీలంక.. పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విజయం

ఆసియా కప్ ఫైనల్‌కు శ్రీలంక.. పాకిస్థాన్‌పై థ్రిల్లింగ్ విజయం

దుబాయ్‌లో జరిగిన మహిళల టీ20 ఆసియా కప్ రెండో సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక 4 వికెట్ల తేడాతో నెగ్గి ఫైనల్‌కు అర్హత సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 130/5 స్కోరు చేయగా, శ్రీలంక ఉత్కంఠభరిత పోరులో 134/6తో లక్ష్యాన్ని అందుకుంది. ఆదివారం జరిగే ఫైనల్‌లో శ్రీలంక భారత్‌తో తలపడనుంది…

దుబాయ్‌లో జరుగుతున్న ఉమెన్స్ ఏషియా కప్‌ టోర్నీలో శ్రీలంక మహిళా జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది. పాకిస్తాన్‌ మహిళా జట్టుతో జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది శ్రీలంక. సెప్టెంబర్ 13న భారత మహిళా జట్టుతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది శ్రీలంక మహిళా జట్టు. 2024 ఉమెన్స్ ఏషియా కప్‌ ఫైనల్‌లో శ్రీలంక చేతుల్లో ఓడింది భారత్. దీంతో ఈసారి రివెంజ్ తీర్చుకోవడానికి మంచి అవకాశం దొరికినట్టైంది. మరోవైపు శ్రీలంక, ఉమెన్స్ ఏషియా కప్‌ ఫైనల్‌కు అర్హత సాధించడం ఇది వరుసగా మూడోసారి.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. మోనీబా ఆలీ 2 పరుగులు చేసి అవుట్ కాగా షావల్ జుల్ఫీకర్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసింది. గుల్ ఫిరోజా 32 బంతుల్లో ఓ ఫోర్‌తో 21 పరుగులు చేసింది.