యాదాద్రి భువనగిరి జిల్లా :
యాదాద్రి : ఈ రోజు అత్యంత విశేషమైన పర్వదినము పరాభవ నామ సంవత్సర ములో. వసంత రుతువు పౌర్ణమి తిథి న శ్రీ స్వామివారు నిండు పున్నమి వెన్నెల లో విష్ణు పాదోద్భవం తీర్థం అని నృసింహ క్షేత్ర మహాత్మ్యం లో చెప్పినట్టుగా స్వామి వారి పాదముల నుండి పుట్టిన తీర్ధరాజము ఈ విష్ణు పుష్కరిణిలో లక్ష్మీ గోదాసమేతముగా విహరిస్తారు.
పుష్కరిణీ తీర్థము లో సమస్త నదీ జలములను మంత్రపూతముగా ఆరాధించి స్వామివారి ని అమ్మవార్లను పుష్కరిణిలో విహరింపచేశారు. ఇలాంటి మహత్తర కార్యక్రమమును తిలకించిన పుష్కరిణీ తీర్థము ను శిరస్సుపై చల్లుకొని నా స్నానమాచరించి నా సమస్త రోగములు మరియు సమస్త పాపములు నశిస్తాయి అని. సంతానము లేనివారికి సంతానము వివాహ ము కానివారికి వివాహము జరుగుతుందని చరిత్ర తెలుపుతుంది.
ఇట్టి కార్యక్రమములో పాల్గొని తిలకించి స్వామివారి అనుగ్రహము కలుగుతుందని ప్రధానార్చకులు తెలియజేశారు…