చక్రాసనం
యోగాతో సాధ్యం కాదంటూ ఏదీ లేదు.. యోగా సాధన చేయడం వల్ల వెయిట్ లాస్ తో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ ఆసనం వల్ల ఉపయోగాలు ఉంటే తెలుసుకోండి..
విధి:–
1. పొట్టపై పరుండి మోకాళ్ళను మడుచుకుని మడమలు తొడల సమీపమునకు చేర్చవలెను
2. రెండు హస్తములను వెనుకకు తిప్పుకొని భుజముల వెనక కొంత ఎడముగా నుంచవలెను. దీనివల్ల శరీరము సరితూగినట్లుండగలదు.
3. శ్వాసను లోపల నింపుకొని నడుము ప్రదేశం మరియు పక్షమును పైకెత్తవలెను.
4. నెమ్మది నెమ్మదిగా చేతులు మరి పాదములను సమీపమునకు తెచ్చుటకు ప్రయత్నం చేయవలెను. దీనివల్ల శరీరము చక్రం వంటి ఆకృతిగా అగును.
5. ఆసనమును వదులు ఉన్నప్పుడు శరీరమును వదులుగా నుంచుచు నడుమును భూమిపై ఆనించవలెను ఈ ప్రకారంగా మూడు నాలుగు సార్లు చేయవలెను.
. లాభములు:–
1. మేరు దండము (వెన్నుముక)ను కోమలంగ నోనర్చి , ముసలి తనమును రాకుండా చేయును. జీర్ణకోసము మరియు ప్రేగులను సక్రియవంత మొనర్చును.
2. శరీరంలో స్ఫూర్తి, శక్తి మరియు తేజస్సును వృద్ధి పరుచును.
3. నడుము నొప్పి శ్వాస రోగము తలనొప్పి కనుల వికారమును సర్వేకల్ మరియు స్పాండిలైటిస్ విశేష లాభాకారియై యుండును.
4. కాళ్లు చేతులు మాంసకండరములను శక్తివంతమొన్రచును.
5. మహిళా మహారాణుల గర్భాస వికారములను తొలగించును.
గమనిక…. శ్రద్ద శ్రీ యోగాచార్య బహార్ అలీ.. ఆధ్వర్యంలో ఉచితంగా యోగా క్లాస్ లు ప్రారంభం…