యోగాతో అసాధ్యం అనేది ఉండదు…

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జడ్పి హెచ్ఎస్ పాండురంగపురం ఖమ్మం లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు పి ప్రేమలత ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు యోగాసనాలు ప్రాణాయామము ధ్యానము శిక్షణ ఇవ్వడం జరిగింది. పిల్లలు క్రమశిక్షణ కోసం బుద్ధి వికాసం కొరకు, మానసిక ఒత్తిడి తగ్గటానికి,శారీరక రుగ్మతలు తగ్గడానికి, మంచి జ్ఞాపకశక్తి కోసం వ్యాధి నిరోధక శక్తి కోసం రోగలభారి నుండి కాపాడుకోవడానికి వచ్చిన రోగాలు తగ్గించుకోవడానికి శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా సంస్కృతి పరంగా సంస్కారపరంగా అందరూ ఉండడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు. ఇందిరా, సంధ్యారాణి, నాగ మోహిని పద్మ, పి ఈ టి మంద నాగప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది..