అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు..

11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఖమ్మం నగరంలో ఉన్న క్రియేటివ్ హై స్కూల్ నందు,యాజమాన్యం బి కమలాకర్ రావు, బి కౌశిక్ , వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవటం జరిగింది.ఈ కార్యక్రమంలో
శ్రద్ధ యోగాచార్యులు షేక్ బహారలి విద్యార్థిని విద్యార్థులకు మరియు మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో కిడ్స్ కి కూడా యోగాసనాలు, ప్రాణాయామము ధ్యానము నేర్పించడం జరిగింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పిల్లలకు జ్ఞాపకశక్తి కోసం శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉండడానికి మరియు రోగాల భారీ నుండి కాపాడుకోవడానికి ఇమ్యూనిటీ కొరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రియేటివ్ హైస్కూల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది..