యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు హత్యలో ట్విస్ట్‌..

యూట్యూబర్‌ వైష్ణవి భర్త హరిబాబు హత్యలో ట్విస్ట్‌.

హరిబాబును తానే చంపానని వైష్ణవి సోదరుడి వీడియో.

నా చెల్లిని చంపినవాడిని చంపేశా-సంతోష్‌.

నా చెల్లికి జరిగినట్టు ఏ ఆడబిడ్డకు జరగకూడదు.

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోతున్నా-సంతోష్‌…

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఘటనలో ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక ఆర్‌ఆర్‌ చౌరస్తా ప్రాంతంలో జనసంచారం ఉండే నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి కారులో వచ్చి హరిబాబుపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. ఈ అకస్మాత్తు పరిణామంతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి…..యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్‌ చౌరస్తాలో కారులో కత్తితో వచ్చిన దుండగుడు నడిరోడ్డుపై హరిబాబును ఆ కత్తితో నరికి చంపాడు. ఈ దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని లేదంటే తామే హత్య చేస్తామని ఇప్పటికే వైష్ణవి కుటుంబసభ్యులు ప్రకటించారని తెలిసిందే. ఈ క్రమంలో హరిబాబు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది…

విడియో లో మాటలు ఇలా..

హరిబాబును తానే చంపానని వైష్ణవి సోదరుడి వీడియో.

నా చెల్లిని చంపినవాడిని చంపేశా-సంతోష్‌
నా చెల్లికి జరిగినట్టు ఏ ఆడబిడ్డకు జరగకూడదు.

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోతున్నా అని సంతోష్‌ పోస్ట్ చేశాడు..

నాకోసం అందరూ పోరాటం చేసి నాకు శిక్ష పడకుండా చూడండి

మా చెల్లికి జరిగినట్లు ఎవరికి జరగకూడదని నేను అతన్ని హత్య చేశాను

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును తానే హత్య చేశానని సెల్ఫీ వీడియో విడుదల చేసిన సంతోష్

తన చెల్లిని చంపిన హరిబాబును హత్య చేయడం సంతోషంగా ఉందని సెల్ఫీ వీడియో

నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో హరిబాబును హత్య చేసిన నిందితుడు సంతోష్ పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు

కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చాలా రోజులు ఎదురు చూశాను.. వాళ్లు న్యాయం చేయలేదు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది

మీ కాళ్లు మొక్కుతా, మీకు దండం పెడుతా నాకు సపోర్ట్ చేసి నన్ను త్వరగా బయటికి తీసుకురండి.. నాకు పెళ్లాం, పిల్లలు ఉన్నారు..

యూట్యూబర్ వైష్ణవి సోదరుడి భార్య..
మరో వీడియో ఇలా

మా ఆయన హత్య చేయడం కరెక్టా కాదా మీరే చెప్పాలి

నన్ను నా ఇద్దరు పిల్లలని వదిలి నా భర్త జైలుకు వెళ్ళాడని బాధగా ఉంది

కానీ వైష్ణవిని చంపినవాడు చనిపోయాడని ఆనందంగా కూడా ఉంది

నా భర్త బయటికి రావాలంటే మీరందరూ సపోర్ట్ చేయాలి..యూట్యూబర్ వైష్ణవి సోదరుడి భార్య.. వేడుకుంటున్నారు..