AFG:అభిషేక్ ఫామ్ లో ఉంటే ఎంతటి బౌలర్ అయిన సరే మూసుకోవాల్సిందే. ఆస్ట్రేలియా నుంచి ఆఫ్గనిస్తాన్ వరకు ఇదే స్టోరీ. తనదైన రోజున విధ్వంసం కాదు అంతకు మించిన స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడు.బంతిని పగిలే దాకా కొడతాడు. అంతేకాదు మైదానం నలుమూలల పరుగులు పెట్టిస్తాడు.
గురువారం ఢిల్లీ వేదికగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ తన ఉగ్రరూపాన్ని చూపించాడు. కేవలం 30 బంతుల్లో సెంచరీ చేశాడు. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతడు.. మిగతా 50 పరుగులు చేయడానికి కేవలం 14 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. అతడి ఇన్నింగ్స్ ఒక విస్ఫోటనం లాగా సాగింది. బంతిమీద పగ ఉన్నట్టుగా అతడు బ్యాటింగ్ చేశాడు. మైదానం నలుమూలల బంతిని పరుగులు పెట్టించాడు.
33 బంతుల్లో 9 ఫోర్లు.. 11 సిక్సర్లతో అభిషేక్ శర్మ ఏకంగా 108 పరుగులు చేశాడు. అంతేకాదు, అతడి స్ట్రైట్ రేటు 327. 27 గా నమోదయింది. తొలి వికెట్ కు సంజు శాంసన్ తో కలిసి ఏకంగా 58 బంతుల్లో 142 పరుగులు జోడించాడు అభిషేక్.