చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మధ్య హాట్ లైన్ నడుస్తుంది
ఏపీలో ఓటు చోరీ అయితే రాహుల్ గాంధీ ఒక్క మాట మాట్లాడడు
వీళ్ళ పార్టీలు ఏంటో, వీళ్ళ ఎజెండాలు ఏంటో – వైఎస్ జగన్..
పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్టZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు..
జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనిపించడం లేదని, ప్రజాస్వామ్యం లేదని అనడానికి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం అని అన్నారు. ఆ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అరాచకం రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగలేదు. వైసీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసి రిగ్గింగ్ చేశారు. పోలీసులు దగ్గరుండి ఏజెంట్లను బూత్ లోపలికి పంపలేదు. ఏజెంట్ బూత్ లోపలకి రానివ్వకుండా దౌర్జన్యంగా రిగ్గింగ్ చేసేశారు.. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిన పరిస్థితి దేశంలో ఎక్కడ చూడలేదంటూ జగన్ అన్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ గురించి కీలక కామెంట్స్ చేశారు..ఏపీ సీఎం చంద్రబాబు సీటులో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం, న్యాయం, ధర్మం, నిబంధనలు, ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి ఒట్టిమాటలేనని, వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయం మాత్రమేనని మరోమారు రుజువైందని జగన్ అన్నారు. ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడ్డం, ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ, తగిన సదుపాయాలు ఇస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి.. కాని, చంద్రబాబు ప్రభుత్వాన్ని వాడుకుని తన ప్రభుత్వ సిబ్బంది, పోలీసుల చేతే ఏకంగా రిగ్గింగ్ చేయించారని విమర్శించారు. మరి దీన్ని ఎన్నిక అని ఎలా అనగలుగుతామని ప్రశ్నించారు. చంద్రబాబు.. ఓట్లను రిగ్గింగ్ చేయగలరేమో కాని, ప్రజల హృదయాలను కాదని అన్నారు…
ZPTC పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ బూత్‌లను అటు ఇటు మారుస్తూ, 2 కి.మీ, 4 కి.మీ.ల దూరానికి మార్చినప్పడే క్షుద్ర రాజకీయానికి నాందిపడిందని విమర్శించారు. మరోపక్క నిన్న రాత్రి నుంచే ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి, సుమారు 200 మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్లు యథేచ్ఛగా చొరబడి, తెల్లవారుజామునుంచే ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి, బూత్‌లను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బయట ప్రాంతాలకు చెందిన తమ టీడీపీ నాయకులతో, కార్యకర్తలతో ఓట్లేయించారని పేర్కొన్నారు. వైసీపీకి చెందిన ఏజెంట్లు బూత్‌ల్లో కనీసం కూర్చోనీయలేదు, ఓటర్లను బూత్‌లవైపునకు రానీయకుండా ఎక్కడికక్కడ భయపెట్టారు, తరిమి కొట్టి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని అన్నారు. మహిళా ఏజెంట్లపైన కూడా దాడులు చేశారన్నారు. స్వేచ్ఛగా ప్రజలు ఓట్లేయడానికి కాపలా కాయాల్సిన డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఇతర పోలీసులు, చంద్రబాబు తప్పుడు ఆదేశాలకు తలొగ్గుతూ, టీడీపీ వాళ్లు చేసే దాడులు, దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలా కాశారని విమర్శించారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సిన డీఐజీ కోయ ప్రవీణ్, టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు సమీప బంధువు, పచ్చచొక్కా వేసుకుని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను ప్రోత్సహించారని మండిపడ్డారు. మరి దీన్ని ఎన్నిక అని ఎవరైనా అనగలుగుతారా? మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడం ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు….
పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న ZPTC సీటును లాక్కునేందుకు, రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్టZPTC సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తనకున్న…