నంబర్ సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్ పంపవచ్చు..!!

వాట్సాప్ వాడనివారు ఉంటారా, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులు వాట్సాప్‌ని ప్రతి రోజు ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌ అనేది సులభంగా సందేశాలు పంపడం, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, ఆడియోలను పంచుకోవడం, ఆన్‌లైన్ కాల్స్ చేయడం వంటి అనేక విధాలుగా ఉపయోగించుకునే ఒక అనుబంధ కమ్యూనికేషన్ టూల్..వాట్సాప్ వినియోగదారులకు అత్యంత సులభమైన మార్గం ద్వారా ఇతరులతో కనెక్ట్ కావడానికి సహాయపడుతుంది. వాట్సాప్‌ ద్వారా మీరు ఏ సమయంలోనైనా, ఎక్కడైనా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు అనేక రకాల మీడియా ఫైల్స్ (సందేశాలు, ఫోటోలు, వీడియోలు) పంపవచ్చు. అయినా, ఈ యాప్‌లో చాలా మందికి తెలియని కొన్ని సరికొత్త ట్రిక్స్ ఉన్నాయి. అవి మీ అనుభవాన్ని మరింత సులభంగా, సౌకర్యవంతంగా చేస్తాయి. కొత్త కొత్త అప్‌డేట్‌లతో వాట్సాప్ ప్రియులకు కొత్తదనం చూపిస్తుందా యాప్.
ఎన్ని అప్‌డేట్‌లు వచ్చినా ఏదొక అసంతృప్తి ఉంటుంది. దాదాపు చాలామంది ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య వాట్సాప్‌లో మెసేజ్ పంపాలంటే కచ్చితంగా నంబర్ సేవ్ చేయాలి. మెసేజ్ వెళ్లాల్ కానీ నెంబర్ సేవ్ చేయకూడదు. సాధారణంగా మనం ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా వాట్సాప్‌లో మెసేజ్ పంపాలంటే కచ్చితంగా వారి నంబర్ సేవ్ చేస్తాం, కానీ వాళ్ల నంబర్ మీకు సేవ్ చేయాలని లేదు. ఇలాంటి సమయంలో ఏమి చేస్తాము తప్పక నంబర్ చేస్తాం కానీ ఇప్పుడా సమస్య లేదు, మీకు ఈ ట్రిక్స్ తెలిస్తే ఈజీగా నంబర్ సేవ్ చేయకుండా మెసేజ్‌ను పంపవచ్చు. దానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం.

1. వాట్సాప్ బిల్ట్-ఇన్ ఫీచర్లను వాడుకుని ఈ సమస్యకి చెక్ పెట్టవచ్చు. అదేలా అంటే మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేసి, “కొత్త చాట్” బటన్ ట్యాప్ చేసి వాట్సాప్ కాంటాక్ట్ కింద మీ పేరును ట్యాప్ చేసి, టెక్స్ట్ ఫీల్డ్‌లో మీరు మెసేజ్ పంపాలనుకున్న నెంబరును పేస్ట్ చేసి చాట్ ప్రారంభించవచ్చు.
2. బ్రౌజర్ ద్వారా కుడా మెసేజ్ చేయవచ్చు. మీ బ్రౌజర్‌లో ఈ లింక్‌ను https://api.whatsapp.com/send?phone=xxxxxx పేస్ట్ చేయండి. ఎంటర్ నొక్కి “చాట్ కొనసాగించు” పై క్లిక్ చేస్తే మీరు మీ వాట్సప్‌కు రీడైరెక్ట్ అవుతారు. అక్కడినుంచి చాట్ చేసుకోవచ్చు.
3. ట్రూకాలర్‌తో కుడా మీ కాంటాక్ట్‌లను సేవ్ చేయకుండా వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్ చేయవచ్చు.
4. గూగుల్ అసిస్టెంట్ ద్వారా నంబర్ సేవ్ చేయకపోయినా ఏ నంబర్ కైనా మెసేజ్‌లు పంపవచ్చు.
5. ఐఫోన్ (IPhone) వినియోగదారులు అయితే నంబర్ సేవ్ చేయకుండా వాట్సాప్ సందేశాలను పంపడానికి సిరి షార్ట్ కట్ లను ఉపయోగించవచ్చు.
ఈ వాట్సాప్ ట్రిక్స్ ద్వారా ఈజీగా నంబర్ సేవ్ చేయకపోయినా మెసేజ్‌లు చేయవచ్చు..